Ustaad Bhagat Singh | సరికొత్త రికార్డ్ సెట్ చేసేనా..?

Ustaad Bhagat Singh | సరికొత్త రికార్డ్ సెట్ చేసేనా..?

Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎలా ఉంది?
మాస్ ఎంటర్‌టైనర్‌గా పవన్ కళ్యాణ్ ఎనర్జీ
హరీష్ శంకర్ స్టైల్ పంచ్ డైలాగులు
అభిమానులకు కిక్ ఇచ్చే ట్రైలర్ సన్నివేశాలు
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం డైలాగ్ హైలైట్
భారీ అంచనాలతో మార్చి 19న విడుదల
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందా?

Ustaad Bhagat Singh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. (Ustaad Bhagat Singh) ఈ భారీ, క్రేజీ సినిమా పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. భారీ అంచనాలతో పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మార్చి 19న ఈ క్రేజీ మూవీ భారీ స్థాయిలో థియేటర్స్ లోకి రానుంది. ఇంతకీ.. ఉస్తాద్ ట్రైలర్ ఎలా ఉంది..?

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh | మాస్ ఎంటర్ టైనర్..

ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ.. ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రైలర్ అంతటా తన ట్రేడ్‌మార్క్ ప్రదర్శించారు. పంచ్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎంటర్ టైన్మెంట్ ఇలా.. ప్రతి అంశం ప్రభావవంతంగా నిలిచి సినిమా (Movie) పై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. వెండితెర పై అభిమానులు చూడాలనుకునే విధంగా పవన్ కళ్యాణ్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో తన సత్తా నిరూపించుకున్నారు.

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh | ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం..

ట్రైలర్ కట్ చాలా షార్ప్‌గా, ఆకర్షణీయంగా ఉంది. థియేటర్లలో అభిమానులు, సినీ ప్రియులకు ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాల విందును అందించబోతుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది. రోజు రోజుకీ సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం వెండితెర పై గుర్తుండిపోయే సినీ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా డైలాగ్స్ విషయానికి వస్తే.. వాడు నీకు భ‌య‌ప‌డ‌లేదా, అస‌లు ఎవ‌డికీ భ‌య‌ప‌డ‌లేదా – అంటూ ఫ‌స్ట్ డైలాగ్ (First dialogue) తోనే హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు హ‌రీష్‌. వ‌యెలెన్స్ అంటే మీనింగ్ తెలియ‌క‌పోవ‌డం మీ అంద‌రికీ ఓ ఫ్యాష‌న్ అయిపోయింది.. చూపిస్తా.. అర్థం, భావం.. అవ‌స‌రం.. అన్నీ చూపిస్తా అంటూ ప‌వ‌న్ ఎంట్రీ ఇవ్వ‌డం ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది. తెలుగు భాష‌లో నాకు నచ్చ‌ని ఒకే ఒక్క ప‌దం డాన్స్‌.. అని ప‌వ‌న్ అన‌గానే.. డాన్స్ తెలుగు ప‌దం కాదు అని కౌంట‌ర్ ఇవ్వ‌డం బాగుంది. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. అంటూ ప‌వ‌న్ చివ‌ర్లో చెప్పిన డైలాగ్ మరీ బాగుందనే టాక్ వినిపిస్తుంది.

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh | సరికొత్త రికార్డులు..

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో (Theatre) అడుగుపెట్టనుంది. ఈ ట్రైలర్ కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చూస్తుంటే.. థియేటర్స్ లో పూనకాలే.. అని.. సరికొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయమని టాక్. మరి.. ఉస్తాద్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

Leave a Reply