బావిలో పూడిక తీయడంలో ఘోరం

బావిలో పూడిక తీయడంలో ఘోరం
- క్రేన్ వైర్ తెగి ముగ్గురు కూలీలు మృతి
- మరొకరికి తీవ్ర గాయాలు
మొగుళ్లపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీయడంలో ఉపయోగిస్తున్న క్రేన్ వైర్ తెగిపోవడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సుకినే దేవారావు (48), బండారి అభిలాష్ (16), పిడిసిల్ల గ్రామానికి చెందిన పైడయ్య (53) స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో కూలీ సుకినే మోహన్‌రావు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బావిలో పూడిక తీస్తుండగా క్రేన్‌కు అమర్చిన వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


