గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్జీల స్వీకరణ….

గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్జీల స్వీకరణ….
పెడన – ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం పెడన మండలం చేవెండ్ర గ్రామ సచివాలయంలో ప్రజలు, నాయకుల నుండి ఎమ్మేల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల ఫై సంబంధిత అధికారులకు చరవాణి నుండి ఆదేశించి, సమస్యను వెంటనే పరిశ్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం.
ప్రతిరోజు ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఎన్డీయే కూటమి పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష, అలాగే పెడన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలే మా లక్ష్యం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి ప్రజల నుండి సమస్యలు పరిష్కరించమని ప్రజల పెద్ద ఎత్తున అర్జీలు ఇస్తున్నారు. వాటిన్నిటి పరిశీలించి, అధికారుల సహకారంతో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.

