విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ…

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ…
గుడివాడ – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురం వార్డులో ఆంధ్ర నలంద మున్సిపల్ హైస్కూల్లో 10 వ తరగతి విద్యార్థి విద్యార్థినిలకు పరీక్ష సామాగ్రి గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ అందజేశారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి విద్యార్థినీలకు విజయం సమకూర్చాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు…! సమాజమే దేవాలయంగా భావిస్తూ ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు మన గుడివాడ పట్టణంలో ఉన్న పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధి, విద్యార్థినిలకు ఆల్ ద బెస్ట్ తెలియజేసి వారికి పరీక్షలకు కావలసిన సామాగ్రి అందజేయడం జరిగిందని తెలియజేశారు.
స్టూడెంట్స్ అందరూ మీరు చదువుకునే స్కూలుకు మంచి పేరు తేవాలని, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, కోరారు. పదో తరగతి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెడు అలవాట్లకి దూరంగా ఉండి తల్లిదండ్రులు, మరియు ఉపాధ్యాయులు మాటలని గౌరవిస్తూ దేశ సమాజా సేవకై పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర నలంద మున్సిపల్ హై స్కూల్ ఉపాధ్యాయులు, గుడివాడ పట్టణ బీజేపీ మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక, లంక రాంబాబు, కుంభం అయ్యప్ప, పండు, గాదె చరణ్, పాఠశాల విద్యార్థి ,విద్యార్థినీలు మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.
