దేవాదుల కాలువకు నీరు ఆపకుండా విడుదల చేయాలి

దేవాదుల కాలువకు నీరు ఆపకుండా విడుదల చేయాలి
1L కాలువ కింద 6వేల ఎకరాల ఆయకట్టు ఉంది
6వేల ఎకరాలకు నీరు అందాలంటే 50క్యూసెక్కుల నీరు రావాలి
మెయిన్ కెనాల్ లో రెగ్యులేటర్, షేటర్ ఏర్పాటు చేయాలి
వర్షాకాలం వరకు 1L కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయాలి
లైనింగ్ పనులు పూర్తి అయితే రైతులకు సమృద్ధిగా సాగునీరు
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిలుపూర్, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం తీగారం, హిమ్మత్ నగర్ గ్రామాల మధ్యలోని 1L గోదావరి కాలువను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. కాలువ వెంట క్షేత్ర స్థాయిలో తిరుగుతూ రైతుల పంటలకు సరిపడా నీరు అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. దింతో రైతులు పంటలకు సరిపోను నీరు రావడం లేదని రైతులే విడతల వారీగా పంటలకు నీరు పెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీహరి తెలిపారు. వచ్చే వర్షాకాలం వరకు 1L కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించే బాధ్యత నాదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.
ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. 1L కాలువకు నీటి విడుదలను ఆపకూడదని అధికారులుకు సూచించారు. సరిపోను నీరు లేక రైతులే విడతల వారీగా నీరు పెట్టుకుంటున్నారని అన్నారు. ఈ సమయంలో నీటి విడుదల ఆపితే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆపకుండా నీటి విడుదల చేయాలని తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న దానికంటే నీటి విడుదలను పెంచాలని 1L కాలువకు 50క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని అప్పుడే 6 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించగలమని వెల్లడించారు.

మెయిన్ కెనాల్ కు రెగ్యులేటర్, షేటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. వచ్చే వర్షాకాలం వరకు 1L కాలువ లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువ పనులకు రైతులు కూడా సహకరించాలని కోరారు. రైతులు సహకరిస్తేనే పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయగలుగుతామని అన్నారు. రైతులు సమన్వయంతో పరస్పర సహకారంతో నీటిని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంట్రాక్టర్లు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

