గరికపాటి అలోచనలు స్పూర్తి దాయకం…

గరికపాటి అలోచనలు స్పూర్తి దాయకం…
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : వేకనూరు మాజీ సర్పంచ్ గరికిపాటి శ్రీనివాసరావు 18వ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖ నేతలు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వేకనూరు మాజీ సర్పంచ్ గరికపాటి శ్రీనివాసరావు మంచి భావాలు కలిగిన వ్యక్తి అని వివాదాల పట్ల సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ఆయన వ్యవహరించిన తీరు వేకనూరు గ్రామంలో అనేక సమస్యల పరిష్కారానికి ఉపకరించాయని, వేకనూరు అభివృద్ధికి శ్రీనివాస రావు తీసుకున్న పలు నిర్ణయాలు త్యాగాలు గ్రామ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడారు.
తొలుత అవనిగడ్డ శాసనసభ్యులు గౌ: మండలి బుద్ధ ప్రసాద్, గరికిపాటి శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించగా అనంతరం పలువురు రాజకీయ నేతలు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆయనకు పూల మాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అక్షయ డెవలపర్స్ అధినేత జనసేన నేత నాయకులు మాదివాడ వెంకట క్రృష్ణ, (క్రిస్టియన్,) కోడూరు మాజి జడ్పిటిసి కోడూరు మండల టీడీపీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, అవనిగడ్డ లంకమ్మ తల్లి దేవాలయ చైర్మన్ అన్నపురెడ్డి వెంకటస్వామి, ప్రముఖులు మత్తే శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది మాదివాడ వెంకటకృష్ణ రావు, తెలుగుదేశం పార్టీ నేత బండే రాఘవ, గాజుల మురళి క్రృష్ణా, వేకనూరు మాజి సర్పంచ్ నిజంపట్నం హరిబాబు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
