జాతీయ యూత్ వాలీబాల్ పోటీలకు నాగశేషు ఎంపిక

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జాతీయస్థాయి యూత్ వాలీబాల్ పోటీలకు కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యాసాయి హైస్కూల్ పూర్వ విద్యార్థి నానం. నాగశేషు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థి ఈనెల 14 నుంచి 20 వరకు ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగే జాతీయస్థాయి యూత్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నాగశేషును వాలీబాల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ వి.హన్మంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్ గౌడ్,సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉపసర్పంచ్ అశోక్,కమ్మర్ పల్లి వాలీబాల్ ఆసొసియేషన్ సభ్యులు ఉట్నూర్ చైతన్య,విక్రమ్,అజాహరోద్దీన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు తదితరులు అభినందించారు.

Leave a Reply