రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిలుపూర్, ఆంధ్ర ప్రభ : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని ప్రజలు ఆయనకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు.చిలుపూర్ మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ రాజకీయ పునః జన్మనిచ్చింది, రాజకీయ దేవుడు కేసీఆర్ అన్న కడియం శ్రీహరి నేడు కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చింది శ్రీహరి నువ్వు టిఆర్ఎస్ ఎమ్మెల్యే అని వెల్లడించినట్టు తెలిపారు. స్పీకర్ ఇచ్చిన దానికి స్పందిస్తూ టిఆర్ఎస్ శ్రేణులు ఆయనను స్వాగతించేందుకు వెళితే పోలీసులతో గెంటి వేయించారని రాజయ్య ఆరోపించారు. తమ పార్టీ వ్యక్తిని గౌరవించుకోవడం తప్పానని ఆయన అన్నారు. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, శ్రీహరిని చీకొట్టినట్లేనన్నారు. కాంగ్రెస్ నాయకులు కడియం శ్రీహరితో తిరిగే అర్హత లేదని ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని రాజయ్య వెల్లడించారు.
రూ.104 కోట్లతో లింగంపల్లి ఎత్తిపోతల పథకం కోసం నిధులు మంజూరు అయితే పనులు ఎందుకు పూర్తి కావడంలేదని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో శ్రీహరి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర నిధులు గ్రామపంచాయతీలకు కేటాయించాల్సి ఉండగా ఆ నిధులను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లకు మాత్రమే నిధులను అందిస్తూ బీఆర్ఎస్ సర్పంచులకు శ్రీహరి కేటాయించడం లేదని తీవ్రంగా విమర్శించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని చెప్పుకునే శ్రీహరి ఎందుకు పక్షపాతం వహిస్తున్నట్లన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీహరి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కేసి రెడ్డి రాకేష్ రెడ్డి, రాజన్ బాబు, హరీష్, రాజు, రమేష్ పాల్గొన్నారు.
