10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్( యు ) మండల కేంద్రంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు సిర్పూర్ (యు) మండల విద్యాశాఖ అధికారి కుడిమెత సుధాకర్ తెలిపారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఒక కేంద్రం, మహాగం బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారని.. రెండు కేంద్రాల్లో మొత్తం 231 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, అందులో బాలురు ఒక 124 బాలికలు ఒక 106 పరీక్షలు రాయనున్నారని చెప్పారు.

నిర్వాణ కోసం సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు ఇన్సులేటర్లను నియమించామని పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి కుడిమేత సుధాకర్ తెలిపారు. పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు భయపడకుండా ధైర్యంగా రాయాలని ఆయన కోరారు.

ఎలాంటి మాస్ కాపింగ్ కు చోటు లేదని ఎంఈఓ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు పోలీస్ భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుందని బయట నుండి ఎవరు కూడా కేంద్రాలకు రాకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ సహకరించాలని మండల విద్యాశాఖ అధికారి కుడిమె త సుధాకర్ కోరారు.

Leave a Reply