Iran Supreme Ready హార్ముజ్ లో నో ఎంట్రీ Andhra Prabha News

Iran Supreme Ready హార్ముజ్ లో నో ఎంట్రీ Andhra Prabha News

  • ఇరాన్ సుప్రీం తొలి ప్రకటన
  • కోమాలో ఉన్నాడన్న ప్రచారానికి చెక్..
  • ముజ్తాబా ఖమేనీ హెచ్చరిక
  • ప్రపంచ చమురు రవాణాకు షాక్..
  • హార్ముజ్ జ‌ల‌సంధిరి ఇరాన్ లాక్
  • ప్రతీకారం తీర్చుకుంటాం.. ముజ్తాబా హామీ
  • మిడిల్ ఈస్ట్‌లో కొత్త టెన్షన్..

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్)

Iran Supreme Ready : అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆప‌రేష‌న్ లో.. దెబ్బ‌తిన్న ఇరాన్ ప‌త్రీకారేచ్ఛ‌తో ర‌గిలిపోతోంది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ ప్రకటించారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. గ‌త 12 రోజులుగా అమెరికా స‌హా మిత్ర‌దేశాల‌పై ఇరాన్ విరుచుకు ప‌డుతున్న త‌రుణంలో.. అటు అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాక్ కూట‌మి .. ప‌ర‌స్ప‌ర దాడులు జ‌రుపుతూనే.. తాజాగా మైండ్ గేమ్ కు శ్రీ‌కారం చుట్టాయి. ఫిబ్ర‌వ‌రి 288న జ‌రిగిన దాడిలో.. నూత‌న సుప్రీం లీడ‌ర్ ముజ్తుబా ఖ‌మేనీ ప్ర‌స్తుతం కోమా స్థితిలో ఉన్నాడ‌ని, ఇరాన్ ప్ర‌జ‌ల‌కు నాయ‌కుడు లేడ‌నే ప్ర‌చారం గురువారం వైర‌ల్ కావ‌టంవ‌తో… తాజాగా ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ముజ్తాబా ఖ‌మేనీ పెద‌వి విప్పారు.


రువారం తన తొలి ప్రకటనను విడుదల చేశారు. అంతర్జాతీయ ఇంధన రవాణాకు హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. యూఎస్-ఇజ్రాయెల్ దాడులలో తీవ్రంగా గాయపడిన ముజ్తాబా కోమాలో ఉన్నాడని అతని కాలును తొలగించార‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ స్థితిలో ముజ్తాబా ఖ‌మేనీ తొలిసారిగా స్పందించారు. త‌న సుదీర్ఘ సందేశాన్ని ఇరాన్ టీవీకి విడుద‌ల చేశారు. ఒక యాంకర్ ఈ సందేశాన్ని చదివి వినిపించారు,
ముజ్తాబా ఖమేనీ ఫోటోను టీడీ స్క్రీన్ ప్ర‌ద‌ర్శించారు. ఈ 56 ఏళ్ల వ్యక్తి గా ఎందుకు కనిపించలేదు, ఆయ‌న మాటలను ఎందుకు వినిపించ‌లేదు, అనే ప్ర‌శ్న‌ల‌కు ఎటువంటి వివరణ ఇవ్వ లేదు.

Iran Supreme Ready : యాంక‌ర్ చ‌దివిన ముజ్తాబా సందేశం ఇలా ఉంది. “మీ అమర వీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండం. నేను అందరికీ హామీ ఇస్తున్నాను” అని సుప్రీం అన్నారు. “మా మనస్సులోని ప్రతీకారం , విప్లవం, నాయకుడు [అయతుల్లా అలీ ఖమేనీ] బలిదానం మాత్రమే కాదు బదులుగా, శత్రువులతోనూ బలిదానం చేయించ‌టానికి దేశంలోని ప్రతి సభ్యుడు ప్రతీకారం తీర్చుకునే వ్య‌క్తిగా ఉంటాడు, “మన దేశం మన ప్రియత‌మ‌ మాతృభూమిపై దురహంకార నాయకులు అన్యాయంగా దాడి చేసిన సమయంలో.., తమ శక్తితో శత్రువుల మార్గాన్ని అడ్డుకుని, మన దేశంపై ఆధిపత్యం చేయగలమని, విభజించగలమనే శ‌క్తుల భ్రమను తిప్పికొట్టిన మ‌న యోధులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అని ముజ్తాబా ఖ‌మేనీ అన్నారు.

Iran Supreme Ready : మినాబ్‌లోని షాజరా తయ్యెబెహ్ ప్రాథమిక పాఠశాల భవనంపై దాడి జ‌రిపి, చిన్నారుల‌ను చంపేసిన హంత‌కుల‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రత్యేకంగా ఖమేని కోరారు. శత్రువు నుంచి అంటే అమెరికా, ఇజ్రాయెల్ నుండి ఇరాన్ తన “పరిహారం పొందుతుంది” అని అన్నారు. అది నిరాకరిస్తే, మేము దాని ఆస్తుల నుంచి సముచితమని భావించే మేరకు తీసుకుంటాం, అది సాధ్యం కాకపోతే, దాని ఆస్తులను అదే స్థాయిలో నాశనం చేస్తాం, ”అని ఆయన అన్నారు.

Iran Supreme Ready : తన పొరుగు దేశాలపై ఇరాన్ దాడి చేస్తూనే ఉంటుందని ఆయతుల్లా కూడా చెప్పారు, అయినప్పటికీ యుఎస్ సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన నొక్కి చెప్పారు. “హార్ముజ్ జలసంధిని మూసివేయడం అనే లివర్‌ను ఖచ్చితంగా ఉపయోగించి కొనసాగించాలి. శత్రువుకు తక్కువ అనుభవం ఉన్న, చాలా దుర్బలంగా ఉండే ఇతర రంగాలను తెరవడంపై కూడా అధ్యయనాలు నిర్వహించాం. యుద్ధకాల పరిస్థితి కొనసాగితే ప్రయోజనకర పరిగణనలకు అనుగుణంగా క్రియాశీలత జరుగుతుంది, ”అని ఖమేని అన్నారు.

Iran Supreme Ready : సోమవారం టెహ్రాన్‌లో జరిగిన తన సొంత వారసత్వ ర్యాలీకి సుప్రీం నాయకుడు, గైర్హాజరయ్యాడు. యుద్ధం ప్రారంభం కాగానే ఇజ్రాయెల్ దాడిలో అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో తన తండ్రి వారసుడిగా నియమితుడైనప్పటి నుండి ఇప్పటికీ ముజ్తాబా బహిరంగంగా కనిపించలేదు.

Iran Supreme Ready : ముజ్తుబా ఖమేనీ కోమాలో ఉన్నాడని టెహ్రాన్‌లోని సినా విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ ఉన్న‌ట్టు ఇరానియన్ ప‌త్రిక ది సన్ లో ఈ ప్రకటన వచ్చింది. “అతని రెండు కాళ్ళు నరికివేశార‌ని, . అతని కాలేయం లేదా కడుపు కూడా చీలిపోయింద‌ని, అతను కూడా కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది” అని ఆ వర్గాలు ఆరోపించాయి.వైమానిక దాడుల స‌మ‌యంలో ముజ్తాబా పాదం విరిగిపోయింద‌ని , కంటికి గాయ‌మైంద‌ని, ముఖంపై స్వ‌ల్ప గాయాలు జ‌రిగాయ‌ని, అత్యంత సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాడని నొక్కి చెప్పారు. అదే సమయంలో, గురువారం త‌ప ప్రకటనలో తండ్రి మరణాన్ని ఖమేనీ అంగీక‌రించారు. దాడి తర్వాత తాను అక్కడే ఉన్నానని తన తండ్రి మృతదేహాన్ని చూశానని వివ‌రించారు.

Leave a Reply