పది నెలల్లోనే ఎస్పీ కృష్ణారావు బదిలీ

పది నెలల్లోనే ఎస్పీ కృష్ణారావు బదిలీ

రాష్ట్ర సర్విస్ నుంచి కేంద్ర సర్విస్ లోని సిబిఐకి బదిలీ,
ఎస్పీ కేంద్ర సర్విస్ కు బదిలీ పై ఆ శాఖలో చర్చలు,

పల్నాడు, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బీ. కృష్ణారావు గత సంవత్సరం సెప్టెంబర్ 14న జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు నిబద్ధతతో, లా అండ్ ఆర్డర్ సమస్యకు అటంకాలు లేకుండా విధి నిర్వహణ నిర్వహించారు. ఆయన్ను కేంద్ర ప్రభుత్వం తమ అధినంలో ఉండే సిబిఐ సర్విస్ కు ఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పది నెలల్లో ఎస్పీ బదిలీ దానికి తోడు కేంద్ర సర్విస్ కు బదిలీ పై వెళ్లడం, ఆ శాఖ సిబ్బందిలో చర్చ జరుగుతోంది.