ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న 17వ వార్డు కౌన్సిలర్

ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న 17వ వార్డు కౌన్సిలర్
-పేద కుటుంబానికి తోడుగా నిలిచిన పొన్నం స్వరూప రాజయ్య
-బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు నుంచి నూతనంగా ఎన్ని కైన కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య ప్రజల సమస్యల పట్ల స్పందిం చడమే కాకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కష్ట కాలంలో ప్రజలకు సహాయం చేయడం ద్వారా తన సేవా భావాన్ని చాటుకుంటున్నారు.
ఇందులో భాగంగా గురువారం వార్డులో అనారో గ్యంతో మృతి చెందిన చెవినబోయిన లచ్చమ్మ కుటుంబాన్ని కౌన్సిలర్ పొన్నం స్వరూ ప రాజయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తోడ్పాటుగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఇలాంటి కష్టసమయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్, నాయకులు పొన్నం నాగ రాజు, నీల పరశారములు, మాజీ వార్డు సభ్యుడు కుంభం నరేందర్, నాయకులు పండుగ అశోక్, మునిగేల రమేష్, రాజు, మధు, పవన్, ఊరిడి శ్రీను, వేముల రాము, శాగ రాజు, శంకర్, పిట్టల హరీష్, కుంభం శంకర్, యాదగిరి, సందీప్, పెసరు శ్రీను, నీల ప్రభాకర్, పిట్టల చంద్ర య్య, పొన్నం రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
