మంత్రి కొండా సురేఖను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు

మంత్రి కొండా సురేఖను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ దంపతులు

కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ–వరద రాజేశ్వర్ రావు రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావును హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


అనంతరం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావలసిందిగా ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు.

Leave a Reply