యల్ పీ జీ గ్యాస్ అక్రమ వియోగం, నిల్వలపై తనిఖీలు

యల్ పీ జీ గ్యాస్ అక్రమ వియోగం, నిల్వలపై తనిఖీలు

స్వాధీనం చేసుకున్న గ్యాస్ సిలిండర్లు
గృహ వినియోగదారు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్

ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని పలు హోటల్లలో, టీ స్టాల్స్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 30 కమర్షియల్, 110 గృహ వియోగ సిలెండర్లు అక్రమంగా నిల్వ ఉంచడంపై స్పందించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయల్ కంపెనీ లు వంట గ్యాస్ సరఫరా నిలిపి వేయడం తో దీనిని ఆసరాగా తీసుకుని గృహ వియోగదారులు, ఆయా కంపెనీల పంపిణీ దారులు అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారని దానిని అరి కట్టేందుకు ఈ చర్యలకు పూనుకున్నట్లు స్పష్టం చేశారు.

కమర్షియల్ సిలెండర్లు ఐదుకు మించి నిల్వ ఉంచ కూడదన్నారు. కాని ఒకే చోట 30 ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. మరి కొందరు రిఫిలింగ్ కార్యక్రమం మొదలు పెట్టారని ఖచ్చితమైన సమాచారం తో వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇక గృహ వినియోగదారులు సింగిల్ సిలెండర్లు 21 రోజులు, డబుల్ సిలెండర్ కలిగిన వారు 31 రోజులకు బుకింగ్ పరిధి నిర్ణయించడం జరిగిందన్నారు. ఎవరూ ముందుగా బుక్ చేసే అవసరం లేదన్నారు. అట్లు కాదని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply