హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి.

హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి.

ఎస్సీ సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన ఎంపిడిఓ తాళ్లూరి రవి.

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : సంక్షేమ హాస్టల్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ను ఎంపిడిఓ సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తాళ్లూరి రవి వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత,వంట విధానం,పరిశుభ్రతను పరిశీలించారు.

ఈ సందర్భంగా తాళ్లూరి రవి మాట్లాడుతూ విద్యార్థులకు సమయానికి పౌష్టికాహారం అందించాలని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు కు సూచించారు. వసతి గృహంలోని విద్యార్థులు నిద్రించే గదులు,వంటశాలను శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి భోజన సౌకర్యం కల్పించాలని, వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్ డబ్ల్యూఓ ను తాళ్లూరి రవి ఆదేశించారు.

Leave a Reply