రోడ్డు భద్రత అవగాహన.. మనందరి బాధ్యత

రోడ్డు భద్రత అవగాహన.. మనందరి బాధ్యత

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్-అలైవ్ వారోత్సవాల్లో భాగంగా స్థానిక కేజీబీవీ పాఠశాల్లోని విద్యార్థినిలకు ప్రిన్సిపాల్ సరోజినీ అధ్యక్షతన రోడ్డు భద్రత అవగాహన పట్ల స్థానిక ఎస్ఐ సోమేశ్వర్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. కేజీబీవీ పాఠశాల్లోని సిబ్బందితో కలిసి విద్యార్థినిలకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల సమీపంలోని పాఠశాల విద్యార్థులచే మానవహారం నిర్వహించారు. ట్రాఫిక్ నియమాల పై విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాల పై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్ గురించి, సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఐలాండ్, జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలు ఆగినప్పుడు వైట్ బ్లాక్ లైన్ వద్ద రోడ్డు క్రాస్ చేయడం వంటి అంశాలను విద్యార్థినిలకు నిశితంగా వివరించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు నియమాలు పాటించాలని సూచించారు. విద్యార్థులే రోడ్డు భద్రతకు బ్రాండ్ అంబాసిడర్లని, పిల్లలు చెప్పే మంచి విషయాలను ప్రతి ఒక్కరూ సగౌరవంగా స్వీకరిస్తారన్నారు. కుటుంబ సభ్యులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలు, అతివేగం ప్రమాదాలు వంటి విషయాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply