BRS | స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ ట్వీట్
BRS | స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ ట్వీట్
BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది చీకటి రోజు అన్నారు.
ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అన్నారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనన్నారు. స్పీకర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు… అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించడమన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… సరైన సమయంలో సమాధానం చెబుతారని కేటీఆర్ అన్నారు.
