52 school | ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి

52 school | ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి

తిరువూరులో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొలికపూడి
మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు..
విద్య ద్వారానే సమాజ అభ్యున్నతి సాధ్యమని వ్యాఖ్య
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

52 school | తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయంలో మంగళవారం సామాజిక సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే (1831–1897) ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, గొప్ప సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఆమె భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి అట్టడుగు వర్గాల మహిళల విద్య, అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. 1848లో దేశంలోనే తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలని తెలిపారు. కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ సమానత్వం కోసం కృషి చేసిన మార్గదర్శకురాలని కొనియాడారు. 1873లో జ్యోతిబా ఫూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించి సామాజిక సంస్కరణలకు పునాది వేశారని చెప్పారు.

52 school |
52 school |

వితంతువుల సంక్షేమం కోసం బాలహత్య ప్రతిబంధక్ గృహాన్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని విశ్వసించి భర్తతో కలిసి 52 పాఠశాలలను స్థాపించి ముఖ్యంగా దళితులు, మహిళల విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. సమాజంలో సమానత్వం కోసం కృషి చేసిన ఈ మహనీయ దంపతులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, పట్టణ కూటమి పార్టీ నాయకులు, మహిళలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

52 school |
52 school |

CLICK HERE TO READ MORE ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం……

CLICK HERE TO READ MORE

Leave a Reply