కార్పోరేషన్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కార్పోరేషన్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
- టౌన్ ప్లానింగ్ విభాగం లో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు
- భవనాల అనుమతుల్లో అవకతవకల పై రికార్డులు పరిశీలన
- టౌన్ ప్లానింగ్ సెక్షన్ కేంద్రంగా కొనసాగుతున్న తనిఖీలు
- కార్పోరేషన్ పరిధిలో అదనపు అంతస్తులు, ప్లాన్ల మంజూరు పై తనిఖీలు
విజయవాడ ఆంధ్రప్రభ : విజయవాడ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం లోనీ ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేశారు. ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏసీబీ డీఎస్పి, బీ.వీ, సుబ్బారావు, ఆధ్వర్యంలోనీ సీఐ లు జీవీ,సత్యనారాయణ,యం.వి. ఎస్,నాగరాజు, గౌర్ నాయుడు, ప్రసాద్,సిబ్బంది తో కలిసి కార్పోరేషన్ కార్యాలయం లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో దాడులు చేశారు.
విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో పలు అక్రమ నిర్మాణాలు, ప్లాన్ మంజూరు లో అవకతవకలు,అవినీతి , తదితర అంశాలపై ఏసీబీ అందిన పిర్యాదుల ఆధారంగా కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం లోనీ టౌన్ ప్లానింగ్ విభాగం లో ఏసీబీ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారుల కు అందిన పిర్యాదుల లో ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్ విభాగంనికి సంభందించినవే కనుక దీనిపై ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా మంజూరు చేసిన పలు అనుమతులు భిన్నంగా క్షేత్ర స్థాయిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. మార్టగేజి,రిలీజ్ రికార్డు లను పరిశీలించారు. సిల్ట్, జి,ప్లస్ 2, నిర్మాణాల పై ప్లాన్లు పొంది. ఆపై అక్రమ నిర్మాణాలు నిర్మాణాలను వంటివి గుర్తించినట్లు తెలిసింది.నగరం లో పలు భవనాలు సంబంధించి ఇచ్చిన ప్లాన్ల లో తేడాలు గుర్తించి,భవన నిర్మాణ లకు అనుమతులు ఇచ్చిన సమయంలో కొన్ని భవనాలకు ఓపెన్ స్పేస్ కు వసూలు చెయ్యవలసిన 14 శాతం చార్జీలు వసులు చెయ్య లేదని గుర్తించారు. గ్రీన్ ట్రీ పీజు అడుగుకు 3 శాతం వసూలు చెయ్యాలి,కొన్ని భవనాలకు ఈ పీజు వసూలు చెయ్యకుండానే అనుమతులు ఇచ్చినట్లు నిర్ధారించారు.దీని ఫలితంగా కార్పోరేషన్ కు , ప్రభుత్వం కు రావలసిన ఆదాయానికి భారీగా గండి పడినట్లు గుర్తించారు.
ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం..
ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్, డైరెక్టర్ జయలక్ష్మి, సెంట్రల్ జోన్ జాయింట్ డైరెక్టర్ సురేశ్ బాబు, ఆదేశాల మేరకు విజయవాడ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం లోనీ టౌన్ ప్లానింగ్ విభాగం పై వచ్చిన ప్రజా పిర్యాదుల భాగంగా విజయవాడ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం పై తనిఖీలు నిర్వహిస్తున్నాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని రికార్డులు పరిశీలించడం, నగరం లో కొన్ని భవనాల అనుమతుల్లో అక్రమాలు జరిగినట్లు రికార్డులు పరిశీలించగా కొత్త మా దృష్టి వచ్చింది, క్షుణ్ణంగా అన్ని రికార్డులు పరిశీలన చేసి రాష్ట ప్రభుత్వం నివేదిక అందజేస్తామని ఏసీీబీ అధికారులు పేర్కొన్నారు.
