Supreme Court | ఆ కేసులో…

Supreme Court | ఆ కేసులో…

Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.35 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్ ల ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ కేసులో ప్రభాకర్‌రావుకు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ప్రభాకరరావు విదేశీ పర్యటన చేయొద్దని తెలిపింది. సాక్షులు, ఆధారాలను ప్రభావితం చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశం..

Leave a Reply