ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి..

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలోనే సరైన విద్యాబోధన ఉంటుందని చౌటుప్పల్ డి.ఎస్.పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొగుజాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. భారతీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ), ఇన్సూరెన్స్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేద విద్యార్థులకు డి.ఎస్.పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి, ఎల్ఐసి చౌటుప్పల్ శాఖ ఏబీఎం సత్యనారాయణ, భాస్కర్ రావు, అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మండల విద్యాధికారి ఎలికట్టె గురువారావులు విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఓరగంటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సమకూర్చిన పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు, పెన్సిల్లును డిఎస్పి మధుసూదన్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే సరైన విద్యా బోధన ఉంటుందని అన్నారు. ఏబీఎం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు.

మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. దాతృత్వం లేనివారు పేదవాళ్ళు అవుతారని, కోట్లు సంపాదించిన సహాయం చేసే గుణం ఉండాలని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో పాఠశాలలో అసౌకర్యాలు లేకుండా చూస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కర్ణ శివకుమార్, కార్యక్రమ సమన్వయకర్త కూరెళ్ళ సత్యనారాయణ, భాస్కర్, నరసయ్య, రాంబాబు, నాగమణి, జానకి, హేమలత, మాధవరెడ్డి, భాగ్యశ్రీ, శ్రవణ్ కుమార్, జనార్దన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శోభ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply