కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కష్టాలు తప్పవు

కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కష్టాలు తప్పవు

సెక్యూరిటీ గార్డు పేషంట్లకు ఓపీలు రాయడం విశేషం

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : గర్భవతులు వైద్య పరీక్షలకు వస్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కష్టాలు తప్పవు సిపిఎం నాయకులు ఫకీర్ సాహెబ్. సోషల్ వర్కర్ నాయకురాలు శోభారాణి అన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో సెక్యూరిటీ గార్డు పేషంట్ల కు ఓపీలు రాయడం విశేషం అని అన్నారు. పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గర్భవతులు ప్రత్యేక పరీక్షలు చేయించేందుకు భారీగా తరలివచ్చారు.

వీరికి సౌకర్యాలు కల్పించాల్సిన వైద్య అధికారులు పట్టించుకోకపోవడం తో త్రివర ఇబ్బందులు పడ్డారు ప్రతినెల 9 వ తేదీన గర్భవతులకు పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించిన రోగాలకు సంబంధించి వైద్య పరీక్షలు మాత్రలు టానిక్ లు ఇవ్వడం జరుగుతుంది. నందికొట్కూరు మండలంతో పాటు వివిధ మండలాల నుండి భారీగా గర్భవతులు తరలివచ్చారు. డాక్టర్ ఒక్కతే ఉండడం వల్ల గర్భిణీలు గంటల కొద్ది క్యూలో నిలబడాల్సి వచ్చింది.

గర్భిణీలు కూర్చోడానికి కుర్చీలు లేవు త్రాగేందుకు నీరు లేక అల్లాడిపోయారు అని ఈ విషయాన్ని గర్భిణీ మహిళలు సిపిఎం పార్టీ నాయకుడు పీ,పక్కిరి సాహెబ్ సోషల్ వర్కర్ నాయకురాలు శోభారాణి దృష్టికి తీసుకుపోవడంతో వారు వెంటనే ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి పరిశీలించగా పలు ఆసక్తి కరమైన వి వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి పక్కిరి సాహెబ్ సోషల్ వర్కర్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ బాగున్న అందులో సిబ్బంది లేక రోగులు వర్ణ తీతముగా ఉన్నాయన్నారు. ఓపి రాసేందుకు ఎవరు లేక అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు పేషంట్ల కు ఓపీలు రాయడం విశేషం అన్నారు.

ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు స్పందించి గర్భిణీలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా హాస్పటల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ కమిటీ సభ్యులైన వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వచ్చే నెల 9న వచ్చే గర్భవతులతో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు హామీన పూర్ణిమ చిన్నారి రామేశ్వరమ్మ, అనురాధ బీబీ తదితర గర్భిణీలు పాల్గొన్నారు.

Leave a Reply