TG | త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..

TG | త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..

జిల్లా కలెక్టర్, అధికారుల తో ప్రత్యేక సమావేశమై…
జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం..
పత్రికారంగం చాలా ప్రత్యేకం…
మీడియా ఫోర్త్ పిల్లర్..
ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం.
టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం మహోత్సవం..

TG | నిజామాబాద్, ఆంధ్రప్రభ : జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశమై త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వా మ్య వ్యవస్థలో పాత్రికే యుల పాత్ర అత్యంత కీలకమని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు . పత్రికా రంగానికి ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత ఉంద ని అన్నారు. ప్రజా సమ స్యలను ప్రభు త్వానికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లే వారధి మీడియా నేనని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉం టానని జర్నలిస్టుల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సోమ వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ లో ప్రెస్ క్లబ్ నూత న కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగ రంగ వైభవంగా జరుపుకున్నా రు.

ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహో త్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ , రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహే ర్ బిన్ హుందా న్,నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, వేలే నెస్ ఆస్పత్రి ఎండీ అసద్ ఖాన్, వెల్నెస్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి రాజకీ య నాయకులు ప్రముఖులు ము ఖ్య అతి థులుగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గం ముఖ్య అతిథు లను శాలువాతో ఘనంగా సన్మానించారు.

టిపిసిసి అధ్యక్షుల చేతుల మీదుగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం..

ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశా ధికారి, ఉపాధ్యక్షులు, సం యుక్త కార్యదర్శులు, కార్య నిర్వాణ కార్యదర్శి, కార్య వర్గ సభ్యులను టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయిం చారు. ప్రెస్ క్లబ్ అభివృ ద్ధికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి టీపీసీసీ అధ్యక్షులు సూచించారు

నూతన కార్యవర్గానికి సన్మానం

ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన కమిటీ నూతన కార్యవ ర్గాన్ని ముఖ్య అతిథులు శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులను ముఖ్య అతిథులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

ఎన్నో సంవత్సరా ల నుంచి ఎదురు చూస్తున్న జర్న లిస్టుల చిరకాల వాంఛ అయిన జర్నలి స్టుల ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ,ఇళ్ల స్థలాల విషయమై ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఆధ్వర్యం లో జర్నలిస్టులు ముఖ్య అతిథులకు ఈ సందర్భం గా వినతి పత్రం అందజేశా రు.

జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా..
పత్రికా రంగం చాలా ప్రత్యేకం
టిపిసిసి అధ్యక్షు లు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

జర్నలిస్టులో లేనిది రాజకీయ నాయకులు లేరనే సూక్తి నేను నమ్ము తానని టిపిసిసి అధ్యక్షు లు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నా రాజ కీయ మార్గంలో ఎందరో జర్నలిస్టులు నాకు ఎంతో సహకారం అందిం చారని ఈ సందర్భంగా తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని అన్నారు.సమాజంలో నాలుగో స్తంభమైన జర్నలిజం వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవి ల్లుతుందని పేర్కొన్నారు.

నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విధి నిర్వహణలో జర్నలి స్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము గుర్తిస్తున్నామని, వారి ఆరోగ్య భద్రత (హెల్త్ కార్డ్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టామని తెలిపారు. వార్తల సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, పేదల గొంతుకగా నిలవాలని ఆయన నూతన కార్యవ ర్గానికి సూచించారు.
ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లోనూ, క్షేత్రస్థాయి సమ స్యలను ప్రభుత్వానికి వివరించడంలోనూ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీ గా తన మద్దతు కొనసా గుతుందని స్పష్టం చేశారు

ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు వీరే.._

అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి డా॥ వాగ్మారే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్ర టరీ బి.రాజు, ఉపాధ్యక్షులు బైసా సంగీత,సతీష్ గౌడ్, గోవిందరాజు, సంయుక్త కార్యదర్శి రవీందర్ నాయ క్,ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు సితారే కృష్ణ, పబ్బ భూమేష్, ఆడెపు నరేంద్ర స్వామి, జి.భాస్కర్ గౌడ్, సందీప్ దేశ్ ముఖ్, కొట్టురు సుదర్శన్, రవి చరణ్ రెడ్డి, తాళ్ళ శ్రీధర్, ప్రీతం రెడ్డి, ఆడెపు శ్రీనివాస్, సి ఎస్ జయపాల్, కొక్కు రవి ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూ పాల్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ,నగర అధ్య క్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, కాటిపల్లి నరేందర్ రెడ్డి, ఖూద్దూస్, వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply