ప్రజాపాలన, ప్రగతిప్రణాళిక..

ప్రజాపాలన, ప్రగతిప్రణాళిక..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీలలో ఇన్చార్జ్ ఎంపీడీవో కొండన్న, ఆయా గ్రామాల సర్పంచ్ ల ఆధ్వర్యంలో ముమ్మరంగాకొనసాగుతున్నాయి. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గ్రామాల్లో పార్టీలకతీతంగా వివిధ పార్టీల నాయకులు ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్నారు.

ఊట్కూర్ మండల కేంద్రంలో సోమవారం ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్, 14వ వార్డు సభ్యురాలు సువర్ణరవి రవికుమార్ ఆధ్వర్యంలో పాతపేట ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద గత కొంతకాలంగా శిథిలావస్థలో ఉన్న కల్వర్టు పనులకు శ్రీకారంచుట్టారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ వస్తువుల వల్ల జరిగే అనార్థాలపై విద్యార్థులకు వివరించారు. బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప, పగిడిమర్రి సర్పంచ్ జాఫర్, వల్లంపల్లి సర్పంచ్ కస్తూరివాణివెంకటరాములు, పెద్ద జట్రంలో సర్పంచ్ వాకిటి వెంకటేష్, అమిన్ పూర్ లో సర్పంచ్ నాగేష్, చిన్న పోర్లలో సర్పంచ్ నికిత, సమస్త పూర్ లో సర్పంచ్ జయప్రకాశ్ రెడ్డి, తోపాటు ఆయా గ్రామాల్లో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు చేపడుతున్నారు.

Leave a Reply