బీటి రోడ్డుకు శంకుస్థాపన..
బీటి రోడ్డుకు శంకుస్థాపన..
కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని తొమ్మిదవ వార్డు అంబేద్కర్ విగ్రహం నుండి ముందడుగు వరకు ఎనర్జీస్ నిధుల నుంచి నూతనంగా నిర్మాణం చేయబోతున్న రోడ్డు పనులు సోమవారం అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, స్థానిక కూటమినేతలతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండలి వెంకట్రామ్, వార్డ్ మెంబర్ వన్ ప్రసాద్, జనసేన మండల పార్టీ అధ్యక్షులు మర్రే గంగయ్య, ఆర్ అండ్ బి అధికారులు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
