Iran President | ఈ దాడులు ఉద్దేశపూర్వకం కాదు

Iran President | ఈ దాడులు ఉద్దేశపూర్వకం కాదు
Iran President | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరాన్ మీడియాతో మాట్లాడుతూ… గల్ఫ్ దేశాలపై దాడులు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, పొరుగు దేశాలు తమపై దాడి చేయకుంటే ఇరాన్ కూడా దాడి చేయదని స్పష్టం చేశారు.
తాత్కాలిక నాయకత్వ కౌన్సిల్ నిన్న ఈ నిర్ణయం తీసుకుందని, ఇక నుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయవద్దని ఆదేశాలు ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఇరాన్ ఈ దాడులు తమ ఉద్దేశపూర్వకం కాదని, పరిస్థితి కారణంగా జరిగాయని చెప్పడం ద్వారా గల్ఫ్ దేశాలతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ ప్రకటనతో గల్ఫ్ దేశాల్లో కొంత ఊరట నెలకొన్నప్పటికీ, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు.
