12 teams | పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్

12 teams | పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్

ఇద్దరు DSP ల నేతృత్వంలో 12 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టిన పోలీసు సిబ్బంది
డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వాడకంపై అవగాహన కల్పించిన పోలీసులు…
శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా విస్తృత కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులు..

12 teams | నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం గురజాల సబ్ డివిజన్ దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గామాలపాడు గ్రామం నందు గురజాల ఇంచార్జి DSP M.వెంకట రమణ ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను, సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా… ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో గామాలపాడు గ్రామం నందు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు – 40, ఆటోలు – 01, గడ్డ పలుగులు – 05, కొడవలి – 1, కర్రలు – 2 స్వాధీనం చేసుకున్నారు.

12 teams |

ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ గామాలపాడు గ్రామంలోని ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ వాడకం గురించి గురజాల ఇంచార్జి DSP గారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

12 teams |

రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు DSP తెలిపారు. అంతేకాకుండా… రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత కేసుల నిందితుల తో సమావేశమై పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

12 teams |

అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,ఏరియాలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ ఆదేశానుసారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గామాలపాడు గ్రామం నందు జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో గురజాల సబ్ డివిజన్ ఇంచార్జ్ DSP M. వెంకట రమణ తో పాటు దాచేపల్లి CI భాస్కర్, పిడుగురాళ్ల CI వెంకట రావు , గురజాల సిఐ A.భాస్కర్, మాచర్ల టౌన్ CI వెంకట రమణ,SI లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Cordon search | పోలీసుల ‘వజ్ర పహార్’ కార్డన్ సెర్చ్

CLICK HERE TO READ MORE :

Leave a Reply