శబరి కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీలో పరిధిలోని 8వ వార్డులోని శబరి కాలనీలో ఇవాళ సీసీ రోడ్డు పనులను మాజీ ఉప సర్పంచ్ కట్ట సురేష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో పట్టణ ప్రగతి నిధులు సుమారు రూ.25 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.
పనులు నాణ్యతతో చేపట్టాలని ఆయన కాంట్రాక్టర్ కు సూచించారు. ప్రతి గల్లీలో సిసి రోడ్ల నిర్మాణం మురుగుకాల్వల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులను మంత్రి విడుదల చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ మక్తల్ పట్టణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి వాకిటి శ్రీహరికి ఈ సందర్భంగా కట్ట సురేష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వాకిటి హన్మంతు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల రంజిత్ రెడ్డి, మాగనూరు మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ఉట్కూరు మండల అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి , పట్టణ కాంగ్రెస్ నాయకులు నీలా గౌడ్ , శంకర్, తాయప్ప,వాకిటి శ్రీనివాసులు, వాకిటి శ్యామ్, నాగేష్ , సాయి కీర్తి ,మూర్తి ,నాగరాజ్, రాజేందర్, కల్లూరి గోవర్ధన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
