ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే..

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే..

ఇఫ్తార్ విందులో భోజనం చేస్తున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తదితరులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : రంజాన్ మాస ఉపవాసలు పురస్కరించుకొని అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ అశ్రద్ బేగం ఆన్సర్ అల్లీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఉట్నూర్ పాత బస్టాండ్ లోని జమా మసీద్ లో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం వచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఇఫ్తార్ విందు భోజనం చేశారు. ఈఫ్తార్ విందు కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్, మైనార్టీ సీనియర్ పెద్దలు సయ్యద్ కరీం, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు, బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీరాం నాయక్, ఉట్నూర్ శంకర్, పాత్రికేయులు వివిధ పార్టీల నాయకులు మైనార్టీ కుల పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply