నల్లమల్ల అడవిలో కార్చిచ్చు మంటలు…

నల్లమల్ల అడవిలో కార్చిచ్చు మంటలు…
వ్యాపిస్తున్న మంటలు అదుపులోకి…
శ్రీశైలం రేంజ్ నల్లమల అడవి లో పెచ్చెరువు సమీపంలో అగ్నిప్రమాదం…
అటవీ సిబ్బందివి మూడు మోటర్ సైకిల్ దగ్ధం..
ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల మార్కాపురం మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో వ్యాపించి ఉన్న నల్లమల్ల అడవి సుమారుగా 3862 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి ప్రాంతం ఉంది. వేసవి కాలం కావడంతో ఈ ప్రాంతంలో తరచుగా అడవిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నంద్యాల జిల్లాలోని ఆత్మకూర్ ప్రాంతంలో వెంకటాపురం నుంచి నల్లమల అడవి గుండా శ్రీశైలం కు వెళ్లే పాదయాత్ర కాలిబాటలో పెచ్చెరువు సమీపంలో శుక్రవారం అడవిలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయని ఆత్మకూరు ఫారెస్ట్ అధికారి విగ్నేష్ తెలిపారు.ఈనెల 16వ తేదీ నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలను శ్రీశైలంలో నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉగాది బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు వంటి తదితర రాష్ట్రాల కు చెందిన శివ భక్తులు శ్రీశైలంకు కాలిబాటన వెళ్లేందుకు ఈ దారి గుండే వెళ్లాల్సి ఉంటుంది.ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా పాదయాత్రలో శ్రీశైలంకు వెళ్లే భక్తులకు తేనె పల సేకరణ పండ్లు వంటి వాటిని విక్రయించేందుకు చెంచులు అడవిలోకి వెళ్లారని వారి ద్వారా ఈ మంటలు వ్యాపించినట్లు అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నల్లమల్ల అడవిలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన అటవీ శాఖ ప్రొటెక్షన్ వాచర్ల సిబ్బందిని మూడు బైకులు మంటల్లో కాలిపోవడం విశేషం. ఈ నల్లమల్ల అడవిలో జరిగిన అగ్నిప్రమాదంపై ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ విచారణ చేపట్టినట్లు తెలిపారు.

