TDP | సొంత పార్టీ నేతలపై మండిపడ్డ కొలికపూడి

TDP | సొంత పార్టీ నేతలపై మండిపడ్డ కొలికపూడి

పార్టీ అంతర్గత విభేదాలపై ఘాటు వ్యాఖ్యలు
శ్రేణులు క్రమశిక్షణ పాటించాలని సూచన
రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు


TDP | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సొంత పార్టీకి చెందిన కొందరు నాయకుల వ్యవహారశైలిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ… తనను చంపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కలకలం రేపాయి. ఇంతకీ కొలికపూడి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఇదే చర్చ టీడీపీలో జోరుగా నడుస్తోంది.

పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆయన మండిపడ్డారు. పార్టీ బలం ప్రజల్లో విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని, నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టే ముందు పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కొందరు నేతలు మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు (Unnecessary comments) చేయడం వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ఎంపీ కేశినేని చిన్ని (MP Keshineni Chinni) చెడ్డ వ్యక్తి కాదన్నారు. అవాస్తవాలు, కుట్రలతో తనను ఆపలేరన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా పోరాటం చేస్తానన్నారు. ఈనెల 2వతేదీన నెమలి వెళ్తుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఆరా తీసిందన్నారు. దాడులు జరగవచ్చని అనుమానించిందన్నారు. కరెంట్ ఆపేసి దాడులకు ప్లాన్ చేశారన్నారు. అయితే ఇది కరెక్ట్ కాదన్నారు. పార్టీ శ్రేణులకు ఆయన క్రమశిక్షణతో వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు. అంతర్గత విషయాలను బయటకు తీసుకురావడం కంటే పార్టీ వేదికలపైనే చర్చించి పరిష్కారం కనుగొనాలని తెలిపారు.

Leave a Reply