ఏటీసీ, ఐటిఐ కేంద్రాన్ని సందర్శించిన యాదాద్రి కలెక్టర్

ఏటీసీ, ఐటిఐ కేంద్రాన్ని సందర్శించిన యాదాద్రి కలెక్టర్
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని ఏటీసీ, ఐటిఐ కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఏటీసీలోని వివిధ రకాల కోర్సులను గురించి ప్రిన్సిపాల్ బి హరికృష్ణ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రైనర్లు, విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి శిక్షణ పద్ధతులను గురించి తెలుసుకున్నారు. సాంకేతిక పరమైన కోర్సుల్లో నైపుణ్యాలను సాధించి విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో కలెక్టర్ గ్రూప్ ఫోటో దిగారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో తొలిసారిగా వచ్చిన కలెక్టర్ కు కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
