ఢిల్లీలో లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత

ఢిల్లీలో లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత
- గణపతి లొంగుబాటుతో మావోయిస్ట్ అగ్ర నేతల శకం ముగింపు
- జగిత్యాల జిల్లా సారంగపూర్ లో జన్మించిన గణపతి
- గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు
- మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోనున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి, ఆపరేషన్ కాగర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే నేపాల్ లో ఆశ్రయం పొందుతున్న గణపతి నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు, త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి భేటి అయ్యారు. మావోయిస్టు పార్టీ సెక్రెటరి దేవూజీ సహా కీలక నేతల లొంగుబాట్ల పై చర్చలు జరపనున్నారు. మార్చ్ 31న జరిగే మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్ పై చర్చ సాగనుంది. అలాగే దేవూజీ, సీఎం రేవంత్ సమావేశం లో మావోయిస్టులు అడిగిన అంశాల పై అమిత్ షాకు సీఎం వివరించనున్నారు.
1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్ లో గణపతి జన్మించాడు. 1970లో రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర వంటి ఉద్యమాలు చేశారు. అనంతరం నక్సస్ ఉద్యమంలో చేరి కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్ గా గణపతికి గుర్తింపు పొందారు. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు చేశారు.
మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో గణపతి కీలక పాత్ర పోషించారు. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగారు. కాగా గణపతి భార్య సుజాత ఇప్పటికీ ఉద్యమంలో కొనసాగుతుంది.
