ఫీడర్ ఛానల్ నిర్మాణానికి శంకుస్థాపన…

ఫీడర్ ఛానల్ నిర్మాణానికి శంకుస్థాపన…
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని రామసాగరం గ్రామంలో ఎన్ఆర్ఇజీఎస్ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న ఫీడర్ ఛానల్ నిర్మాణ పనులకు బుధవారం గ్రామ సర్పంచ్ ఇంగాల నాగలక్ష్మి శంకుస్థాపన చేసారు. ఈ ఫీడర్ ఛానల్ నిర్మాణం పూర్తయితే సాగునీటి సరఫరా సక్రమంగా అందుబాటులోకి వచ్చి వ్యవసాయ భూములకు నీరు చేరనుంది.
దీని ద్వారా రైతులకు సాగు సౌలభ్యం కలిగి దిగుబడులు పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టం కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సర్పంచ్ ఇంగాల నాగలక్ష్మి మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధులను పారదర్శకంగా వినియోగిస్తూ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వీరేశం, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
