బాల్క సుమన్ విడుదల..

బాల్క సుమన్ విడుదల..

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి రాళ్లదాడి ఘటనలో ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎట్టకేలకు జైలు నుండి బుధవారం ఉదయం 8 గంటలకు విడుదలయ్యారు. క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న రాళ్లదాడి ఘటనలో బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 18వ తేదీన ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. పోలీసులు పలు పిటి వారింట్లు, కస్టడీ పిటిషన్లు వేసినప్పటికీ మంచిర్యాల జిల్లా జూనియర్ సివిల్ జడ్జి వాటిని సున్నితంగా తోసిపుచ్చారు.

సోమవారం రాళ్లదాడి ఘటనలో బెయిల్ మంజూరు అయినప్పటికీ చెన్నూర్ లో నమోదైన ధర్నా కేసు పై మంగళవారం న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసులోనూ బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఉదయం అయన జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రి జోగు రామన్న సహా బీఆర్ఎస్ కీలక నేతలు సుమన్ కు జైలు వద్ద ఘన స్వాగతం పలికారు. సుమన్ తో పాటు మూల రాజిరెడ్డి సైతం బెయిల్ పై బయటకు వచ్చారు.

Leave a Reply