Snake | భయపడకుండా…

Snake | భయపడకుండా…
Snake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక యువకుడు చూపిన అసాధారణ ధైర్యం, తెలివి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోవూరులో భోజనం చేస్తుండగా రక్తపింజరి పాము కరిచిన యువకుడు భయపడకుండా, ఆ పామును చంపి… దాని మృతదేహాన్ని చేతిలో పట్టుకుని నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాడు.

“పాము ఏ రకమో వైద్యులకు తెలియజేయడానికే దాన్ని చంపి తీసుకొచ్చాను” అని ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్య పరిచాయి.
ఈ తెలివితేటల వల్ల వైద్యులు సరైన యాంటీ-వెనమ్ వెంటనే ఇచ్చి చికిత్స అందించగలిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా… యువకుడు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

