హాకర్లకు శాశ్వత పరిష్కారం చూపాలి…

హాకర్లకు శాశ్వత పరిష్కారం చూపాలి…

కార్పోరేషన్ అధికారులకు పుణ్య శిల వినతి……..
కూటమి ప్రభుత్వం నాయకుల ఒత్తిడి తో మాంగో మార్కెట్ హాకర్ల తొలగింపు…
నోటీసులు ఇవ్వకుండా హాకర్ల తొలగింపు హేయమైన చర్య…
జీవనం సాగిస్తున్న హాకర్లను రోడ్డు నా పడేసిన కూటమి నాయకులు…
కూటమి ప్రభుత్వం నాయకుల ఒత్తిడి హాకర్లను తొలగించిన కార్పోరేషన్ అధికారులు…
నష్టపోయీన హాకర్లకు శాశ్వత పరిష్కారం చూపాలీ…
34 వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశిలా డిమాండ్…

విజయవాడ కార్పోరేషన్, ఆంద్రప్రభ : విజయవాడలోని మ్యాంగో మార్కెట్ వద్ద ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారుల తోపుడు బండ్లను ధ్వంసం చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బండి పుణ్య శీల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదారేశ్వరరావుపేట 34 వ డివిజన్ పరిధిలో ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసుకుంటున్న హాకర్ల పట్ల అధికారులు నిర్దాక్షణ్యంగా వ్యవహరించారని ఆమె మండిపడ్డారు.

బాధిత వ్యాపారులతో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లిన ఆమె, అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉదయం ప్రొక్లైన్లతో వచ్చి, కనీసం మరమ్మతులకు కూడా వీలు లేకుండా బండ్లను, చెరకు మిషన్లను విరగ్గొట్టడం దారుణమని ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఒత్తిడి తోనే కార్పోరేషన్ అధికారులు ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ట్రాఫిక్ సమస్య ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కరించాలి తప్ప, పేదల జీవన భృతిని దెబ్బ తీయడం సరి కాదని పేర్కొన్నారు. నష్ట పోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని, వారందరికీ శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply