దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం

దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జరుగుతున్న రేణుకాచార్య జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సోమేశ్వరాలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. కర్ణాటక తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన శైవ భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
దీపాల వెలుగుల్లో సోమేశ్వరాలయ ప్రాంగణం కాంతివంతంగా మారిపోయింది. గ్రామ ప్రజాప్రతినిధులతో పాటు ఆలయ అర్చకులు సోమయ్య స్వామి, గంగాధర్, చంద్రశేఖర్ పూజలు నిర్వహించారు. గంగుల శ్రీనివాస్, గాదే సోమిరెడ్డి తో పాటు గ్రామ ముఖ్యులు పాల్గొన్నారు. సిఐ యాలాద్రి ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లను చేశారు.


