Fixed Deposits | అధ్యక్షుడు లేకుండా ఉపాధ్యక్షుడితో మమ….

Fixed Deposits | అధ్యక్షుడు లేకుండా ఉపాధ్యక్షుడితో మమ….

శ్రీ నగరాలు దేవస్థానం సర్వ సభ్య సమావేశం
గందరగోళంగా జమా ఖర్చులు
గత ఏడాది తో పోలిస్తే తగ్గిన ఆదాయం
ఖారారు కాని ఎన్నికల తేదీ
కళ్యాణమండపం లో బాగోలేని బాత్రూమ్ లకు శానిటరీ ఖర్చులు 5 లక్షల పైనే

Fixed Deposits | చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ చిట్టినగర్ లో ఉన్న శ్రీ నగరాలు సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం కళ్యాణ మండపం లో సర్వ సభ్య సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. అసలు అధ్యక్షుడే లేకుండా సర్వ సభ్య సమావేశం ఏమిటి అని గొడవ తో సర్వ సభ్య సమావేశం ప్రారంభమైంది. సర్వ సభ్య సమావేశం లో 27 మంది పాలక మండలి సభ్యుల్లో అధ్యక్షుడు తో సహా చాలా మంది సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. అధ్యక్షుడు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కానీ పాలక మండలి ఆమోదించలేదని చెబుతున్నారు.

అసలు అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశారని సభ్యులకు తెలియలేదు. ఒకరు ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు డయాస్ మీద కాకుండా మిగిలిన సామాన్య సభ్యులతో పాటే కూర్చున్నారు. సర్వ సభ్య సమావేశంలో 3 ఏళ్ళు ఉండవలసిన పాలక మండలి కాలపరిమితి 5 ఏళ్ళు అయ్యింది మీరు చేసిన అభివృద్ధి పనులు చెప్పండి అన్న సభ్యుల సూటీ ప్రశ్న కు సైతం పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పలేని పరిస్థితి. పాలక మండలి సభ్యులు చెప్పిన ఏకైక అంశం తాము ఎంతో కష్టపడి దేవస్థానానికి 5 ఏళ్ళు పాటు మినహాయింపు తీసుకు వచ్చాం అని తెలిపారు.

Fixed Deposits |

సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ప్రశ్నించడానికి మైక్ సైతం ఏర్పాటు చేయలేదని గట్టిగా ఒక సభ్యుడు అడగటం తో మైక్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు పనిచేయటం లేదని ఎందుకు వాటిని బాగు చేయించ లేదని సభ్యులు అడిగేరు. అలాగే దాతలు ఇచ్చిన మినరల్ వాటర్ ప్లాంట్ పాడైపోయినా ఎందుకు బాగు చేయించ లేదని సభ్యులు అడిగేరు. గత 25 సంవత్సరాలుగా కళ్యాణమండపం లో ఉన్న బాత్రూమ్ లు బాగోలేదు కనీసం వచ్చే పాలక మండలి సభ్యులైన సరే, మహిళలకు, పురుషులకు గా వేరు వేరుగా బాత్రూమ్ లు ఏర్పాటు చేయాలని ఒక సభ్యుడు సూచించారు.

కొసమేరుపు ఏమిటంటే బాగోలేని బాత్రూమ్ లకు శానిటరీ ఖర్చుకు 5 లక్షల పై మాటే. దేవ దేవుని కళ్యాణ మహోత్సవానికి కూడా టికెట్లు పెట్టి సామాన్య భక్తులకు కళ్యాణం చూసే భాగ్యాన్ని దూరం చేశారని ఒక మహిళా సభ్యురాలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం అమ్మవారి అతఃరాలయం లో ఒక భక్తుని దర్శనానికి 20 రూపాయలు, విడి రోజుల్లో 10 వసూలు చేస్తున్నారు, ఇలా ప్రతి చోటా టికెట్లు పెట్టినా పూజా రుసుము వల్ల వచ్చిన ఆదాయం కేవలం 1, 67,727 మాత్రమే ఉంది. అమ్మవారి కి, అయ్యవారికి ఎంత జ్యూవెలరీ ఉందో జమా ఖర్చులు లో ఎక్కడా చూపించ లేదు కానీ జ్యూవెలరీ మీద 35, 864 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించినట్లు చూపించారు.

దేవస్థానం లో ఉన్న అద్దె షాపులను కిరాయి కి తీసుకొనే వారు చెల్లించే లీజు డిపాజిట్లు ఉన్నట్లు జమా ఖర్చులు లో ఎక్కడా చూపించ లేదు కానీ వాటిని తిరిగి చెల్లించినట్లు 1, 11, 400 ఖర్చు చూపించారు. ఇక గత ఏడాది నాటికే ఉన్న బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్లు 29,42,100 రూపాయలు ఉన్నాయి, వాటికి వచ్చిన వడ్డీ మాత్రం 1,01,994 గా చూపించారు. అంటే సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్ లో వచ్చే 4 శాతం వడ్డీ కూడా రాలేదు అని తెలుస్తోంది. ఇలా ప్రతి దశలోనూ జమా ఖర్చుల్లో గందరగోళం నెలకొంది.

దేవస్థాన కమిటీ కార్యదర్శి ఎం.హనుమంతరావు 2024-25 సంవత్సరానికి గాను తొంభై లక్షల ఏభై రెండు వేల తొమ్మిది వందల డెభై తొమ్మిది రూపాయలు జమా ఖర్చులను సర్వ సభ్య సమావేశం లో ప్రవేశ పెట్టిన అనంతం సభ ఆమోదం తెలిపింది.కొంతమంది మంది సభ్యులు ఎన్నికల గురించి ప్రస్తావన తీసుకు రాగా ఏ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారని తెలుపలేదు. మెజారిటీ సభ్యులు లో దేవస్థానాన్ని రక్షించుకోవాలి అనే ఆవేదన కనబడింది.

Leave a Reply