war| ఇరాన్ సుప్రీం లీడర్ హతం

war| ఇరాన్ సుప్రీం లీడర్ హతం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దశాబ్దాల పాటు పశ్చిమాసియా రాజకీయాలను శాసించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ శకం ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన అత్యంత రహస్య దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక సైనిక నేతలు మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’.. పక్కా స్కెచ్‌తో అటాక్ ఫిబ్రవరి 28, 2026 తెల్లవారుజామున టెహ్రాన్‌లోని ఖమేనీ నివాస సముదాయం ‘లీడర్షిప్ హౌస్’ లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ జరిగింది. అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇజ్రాయెల్ సంస్థ మొస్సాద్‌లు అందించిన పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగాయి.
ఖమేనీ తన కుటుంబ సభ్యులు, ఐఆర్జీసీ (ఐఆర్జీసీ) కీలక నేతలతో సమావేశమైన సమయంలో సుమారు 30 బంకర్ బస్టర్ భారీ బాంబులతో దాడి చేశారు. ఖమేనీ తప్పించుకోవడానికి ఉన్న అన్ని దారులను ముందుగానే మూసివేసి.. భూగర్భ బంకర్లను సైతం ఛేదించే అత్యాధునిక బాంబులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవడు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది.
