Tirumala |లడ్డు ప్రసాదంపై నిజాలు అంశంపై చర్చ…

Tirumala | లడ్డు ప్రసాదంపై నిజాలు అంశంపై చర్చ…
పవర్ పాయింట్ ప్రజెంటేషన్…
హాజరైన పలు సంఘాల స్వామీజీలు…
Tirumala | పాయకాపురం, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్నఅసత్యప్రచారాలు, చంద్రబాబు హయాంలో జరిగాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నగరంలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయం పద్మశాలి కల్యాణ మండపంలో శనివారం తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదంపై నిజాలు అంశంపై చర్చ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ బ్రాహ్మణ నాయకులు, వివిధ సంఘాల స్వామిజీలు పాల్గొన్నారు. కూటమి హయాంలో టీటీడీలో జరిగిన అపచారాలను హిందూ ధర్మ పరిరక్షణ వేదిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ద్వారా మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్లు వివరించారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం శ్రీవారినిలాగారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డులో కల్తీ జరిగిందని అసత్యాలు మాట్లాడుతున్నారని వారు దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు అంటే గౌరవం లేదు , సీబీఐ అంటే లెక్కలేదని మండిపడ్డారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైసిపి అడుగుతుంటే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. మతం పేరుతో వైసీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. మేధావులతో కలిసి రాష్ట్రంలో వాస్తవాలు తెలిసేలా కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.సిట్, సీబీఐ కొవ్వు లడ్డులో కలవలేదని చెప్పిందని తెలిపారు. 20 నెలలుగా వైసీపీపై కూటమి ప్రభుత్వం బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. లడ్డులో కొవ్వు లేదని సీబీఐ సిట్ చెప్పినప్పటికి చంద్రబాబు శైలి మారలేదని అన్నారు. ఏ. ఆర్.డైరీ నుంచి తిప్పి పంపిన నెయ్యి ట్యాంకర్లు వైష్ణవి డైరీ పేరుతో తిరిగి తిరుమలకు ఎలా వచ్చాయని వారు ప్రశ్నించారు.

2024-7-25న నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారని అన్నారు. ఆ నాలుగు నెయ్యి ట్యాంకర్లను అదే సంవత్సరం జూలై 27న శ్రీకాళహస్తి దగ్గర రాఘవేంద్ర స్టోన్ క్రషర్ లో దాచి ఉంచారని అన్నారు. ఆ నాలుగు ట్యాంకర్లను ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో మళ్లీ తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి పంపించారని ప్రస్తావించారు. ఈ \విషయాన్ని సుప్రీంకోర్టు వేసిన సిట్ తన ఛార్జ్ షీట్ లో పేర్కొందని తెలిపారు. వైష్ణవి డెయిరీతో టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీకి అనుబంధం ఉందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రేణులకు వివరించారు.

మేం వాస్తవాలు వెలికి తీయగానే వైష్ణవి డెయిరీ తన బోర్డులకు రంగులు వేశారని తెలిపారు. జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పందికొవ్వు, చేపనూనె లేదని సిట్ తేల్చి చెప్పిందని అన్నారు. 2019 మార్చి 6వ తేదీన 82వేల కిలోల నెయ్యి సప్లై కోసం బోలేబాబా డెయిరీకి చంద్రబాబు అనుమతిచ్చని సంగతి వాస్తవం కాదా అని వారన్నారు. ప్రీనియర్ అగ్రిఫుడ్స్ నుంచి 273.95 రూపాయలకు నెయ్యి కొన్నది చంద్రబాబే అన్నారు. 300 రూపాయిలకి నెయ్యి వస్తుందా అని అడిగిన చంద్రబాబు అంత తక్కువకు ఎలా కొన్నాడని వారు ప్రశ్నించారు.
2026 ఫిబ్రవరి10 వరకూ హెరిటేజ్కు ఇందాపూర్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్గా ఉందని అన్నారు. వైసిపి ప్రశ్నించగానే 2026 ఫిబ్రవరి 15న హెరిటేజ్ కు ఇందాపూర్ కో మాన్యుఫ్యాక్చర్ యూనిట్ గా మారిపోయిందని తెలిపారు. 2016 ల్యాబ్ టెస్టులలో ఇందాపూర్ డిస్ క్వాలిఫై అయ్యిందని వెబ్ సైట్ ద్వారా తెలిపారు. మూడు నెలల్లోనే ఇందాపూర్ను డిస్ క్వాలిఫై లిస్ట్ నుంచి చంద్రబాబు తప్పించారని అన్నారు. చంద్రబాబు వైఖరి పవన్ కళ్యాణ్ కు కూడా నచ్చడం లేదని అన్నారు.లడ్డూ అంశంపై గత ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చెప్పారని పేర్కొన్నారు.

చనిపోయిన వ్యక్తి పైన కూడా చంద్రబాబు బురదజల్లడం మానుకోలేదని తెలిపారు. తిరుమలకు రెండు కొండలు చాలని చెప్పినట్లు వైఎస్సార్పై నిందలు వేయడం చంద్రబాబు నీచబుద్ధి తెలుస్తుందని అన్నారు. తిరుమలకు ఏడు కొండలు ఉండాలని 746,747 జీవోలు ఇచ్చింది వైఎస్సార్ అని తెలిపారు. 2009 ఎన్నికలకు ముందు 746,747 జీవోలను రద్దు చేస్తానని చెప్పింది చంద్రబాబు కదా అని వారు ప్రశ్నించారు. 2014-19 మధ్య కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో ఆలయాలను కూల్చి వేయించింది చంద్రబాబు అని అన్నారు.
2015 గోదావరి పుష్కరాల్లో ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కుంభమేళాలో చనిపోరా అని నిర్లక్ష్యంగా చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాటలో భక్తులు చనిపోయారని అన్నారు. 2025 ఏప్రిల్లో తిరుమలలో వందకు పైగా గోవులు చనిపోయాయని, 2025 ఏప్రిల్ 21న శ్రీకూర్మంలో తాబేళ్లు మృతి చెందాయని, సరైన నిర్వహణ లేక తాబేళ్లు చనిపోతే గుట్టుచప్పుడు కాకుండా తగలబెట్టారని వారన్నారు.
2025 మార్చిలో ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టారని అన్నారు. సింహాచలంలో నాశిరకం గోడను కట్టి చందనోత్సవంలో భక్తుల ప్రాణాలకు కారకులయ్యారని అన్నారు.సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని చెప్పినందుకు భక్తులపై కేసులు పెట్టారని తెలిపారు. అన్నవరంలో ప్రసాదాన్ని ఎలుకలకు, కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జి దుర్మార్గం అన్నారు.
ఏపీలో ఎప్పుడైనా ఆలయాల్లో లాఠీ ఛార్జి చేసిన సంఘటనలు చూశామా అని వారన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాలయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారని తెలిపారువిజయవాడలో చంద్రబాబు కూల్చిన రామతీర్ధంలో రాముల వారి విగ్రహ ధ్వంసం ఘటనలో బాధ్యుల పై చర్యలు తీసుకున్నామని అన్నారు. దర్యాప్తులో విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి టిడిపి పార్టీకి చెందిన వారేనని తేలిందని పేర్కొన్నారు. రాముడి విగ్రహం తల నరికిన వ్యక్తికి అశోక్ గజపతిరాజు పారితోషకం ఇచ్చారని ఆరోపించారు.
రాముడి విగ్రహం పెట్టడంతో పాటు కేవలం తొమ్మిది నెలల్లోనే రామతీర్ధం టెంపుల్ పునఃప్రతిష్ట చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదని వారన్నారు. అంతర్వేది రథం దగ్ధం గురించి బీజేపీ నేతలు ఈరోజుకీ మాట్లాడుతున్నారని, రథం దగ్ధం ఘటన పై సిబిఐ దర్యాప్తు చేయించాలని ఆనాడు బీజేపీ నేతలు డిమాండ్ చేశారని తెలిపారు. వెంటనే సిబిఐ దర్యాప్తు కోసం జగన్ కేంద్రాన్ని కోరారని తెలిపారు. ఏడాది కాలంలోనే కొత్త రథాన్ని తయారు చేయించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే కదా ఉంది, బీజేపీ నేతలు అంతర్వేధి రథం ఘటన పై సీబీఐ దర్యాప్తు గురించి గుర్తుకురావడం లేదా అని వారు ప్రశ్నించారు.
