Temple | కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి…

Temple | కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి…
Temple | ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.వి. రెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్ కలిసి ప్రోటోకాల్ ప్రకారం దైవదర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు ప్రసాదం, శేషవస్త్రాన్ని అందజేసి సత్కరించారు.

