ఇసుక డంపులపై రైడ్ చేసిన పోలీసులు

ఇసుక డంపులపై రైడ్ చేసిన పోలీసులు

కరీమాబాద్,ఆంధ్రప్రభః వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ ,రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి ప్రభుత్వ వీసీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక డంపుల పైన రైడ్ చేయడం జరిగింది.గురువారం సాయంత్రం నిర్వహించిన ఈ ఆకస్మిక తనిఖీలలో ఎస్ ఆర్ ఆర్ తోట లో అక్రమంగా నిర్వహిస్తున్న 03 ఇసుక డంపులని గుర్తించి తగు చర్య నిమిత్తం రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా సరి అయిన అనుమతులు లేకుండా వ్యాపారులు ఎవరు కూడా ఇసుక నిల్వలు చేయకూడదని, అక్రమంగా ఇసుక తరలించినా, నిల్వ చేసినా చట్ట పరంగా చర్యలు తీసుకోబడతాయని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ అన్నారు. తనిఖీల్లో తాసిల్దార్ కార్యాలయం,ఆర్ ఐ కీర్తన్, ఎస్సై ఏం.సురేష్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply