చిట్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ

చిట్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ
చిట్యాల ,ఆంధ్రప్రభ: నాగర్ కర్నూలు జిల్లా బమ్మెర లో చిన్నారి మృతిపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం రాత్రి మండల కేంద్రంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొ త్తుల ర్యాలీ నిర్వ హించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జాక్ ,రజక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా ఐక్యవేదిక నా యకులు బుర్ర వెంకటేష్, తౌటం నవీన్, పుల్ల అశోక్, శిలపాక నాగరాజు, పుల్ల మల్లయ్యలు మాట్లాడుతూ బమ్మెర గ్రామంలో అగ్రవర్ణాల చేతిలో మృతి చెందిన చిన్నా రి మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రజక సం ఘం నాయకులు పాండ్రాల వీరస్వామి, మూస పూరి రవీందర్, కుమారస్వామి, ఉప్పుల కిరణ్ ,తిరుపతి, శశి కుమా ర్ , కిషన్, రమేష్ , నాగరాజు, రమేష్ , తదితరులు పాల్గొన్నారు.
