కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

కందుకూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
వేంసూరు, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కందుకూరు గ్రామ సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి కోరిక మేరకు ఖమ్మం సాయిరాం ప్రైవేట్ వైద్యశాల నిర్వహకులు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జంగాల రాజేశ్వరారావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా సాయిరాం హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరంలో సుమారు 200 మందికి పైగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు జంగాల రాజేశ్వరరావు, సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డైరెక్టర్ సామ్యూల్ గెడ్డం, డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, సాయిరామ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విజేష్ వర్మ, డాక్టర్ భార్గవి శివలంక, డాక్టర్ శ్రావణి, డాక్టర్ రేణుక, డాక్టర్ భరత్ తోపాటు వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
