సిఇఐఆర్ సేవలతో 122 మొబైల్ ఫోన్లు అందజేత

సిఇఐఆర్ సేవలతో 122 మొబైల్ ఫోన్లు అందజేత
సిఇఐఆర్‌తో 122 ఫోన్ల రికవరీ..
2589కు చేరిన మొబైల్ ఫోన్లు రికవరీలు …
7వ విడతలో 18 లక్షల విలువైన ఫోన్లు అందజేత..
విజయవాడ, క్రైమ్, ఆంధ్రప్రభ : పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు మరో ముందడుగు వేశారు. సిఇఐఆర్ సేవల ద్వారా రికవరీ చేసిన 122 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ డిసిపి కృష్ణ ప్రసన్న ఆధ్వర్యంలో బాధితులకు తిరిగి అందజేశారు.పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వారి మొబైల్ ఫోన్లను అందించారు. ఈ విడతలో సుమారు 18 లక్షల రూపాయల విలువైన ఫోన్లు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు ఆరు విడతల్లో 2467 మొబైల్ ఫోన్లు రికవరీ చేయగా, తాజా 122 ఫోన్లతో కలిపి 2589కు చేరింది. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఇఐఆర్ సేవలను వినియోగించుకోవాలని, సైబర్ మోసాలకు గురైనపుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సమయానికి ఇచ్చే ఫిర్యాదు ఆస్తి పునరుద్ధరణను వేగవంతం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బంది బాధితులు పాల్గొన్నారు.

