నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేసిన కాలనీవాసులు

నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేసిన కాలనీవాసులు
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభః భగత్ సింగ్ నగర్ పోచమ్మ ఆలయంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం బస్తివాసుల ఆధ్వర్యంలో నాగదేవత విగ్రహాన్నిప్రతిష్టించుకున్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ లో గల పోచమ్మ ఆలయంలో బస్తీ వాసులు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 వార్డు కౌన్సిలర్ కూతురు ప్రభాకర్. సీనియర్ నాయకుడు పచ్చిక లక్ష్మారెడ్డి, కాలనీవాసులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.
