చాగల్లు ఎస్సీ కాలనీలో అభివృద్ధికి అడుగులు

చాగల్లు ఎస్సీ కాలనీలో అభివృద్ధికి అడుగులు
- 9వ వార్డు కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్
స్టేషన్ ఘనపూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు 9వ వార్డు ఎస్సీ కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం కౌన్సిలర్ సౌదరపల్లి సంపత్ రాజ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డా. కడియం కావ్య నిధుల నుంచి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ కాలనీలో సంవత్సరాలుగా రహ దారి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. వర్షాకాలంలో బురదమయంగా మారే రహదారుల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పనులు పూర్తయితే రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డా. కడియం కావ్య నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ కాలనీల అభివృద్ధికి ప్రాధా న్యత ఇస్తున్నానని చెప్పారు.
