High Court | బాంబు బెదిరింపులు

High Court | బాంబు బెదిరింపులు
High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో.. పలు స్కూళ్లకు, కోర్టులకు బాంబు బెదిరింపు ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా… తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో హైకోర్టు ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
హైకోర్టుతో పాటు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
