2.14Lakhs| KTM కొత్తకొత్త‌గా..

2.14Lakhs| KTM కొత్తకొత్త‌గా..

2.14Lakhs| KTM ‘250 డ్యూక్’, ‘200 డ్యూక్‌’-
త్వ‌ర‌లో మార్కెట్‌లోకి..
ధర సుమారు రూ.2.14 లక్షలు

    2.14Lakhs| ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : యువ‌కులు బైకుల‌ మీద రివ్వున దూసుకుపోవ‌డం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు మోడ్ర‌న్ బైక్‌లు అంటే అమితాస‌క్తి చూపుతారు. మార్కెట్‌లోకి కొత్త బైక్‌లు ఏమొస్తున్నాయా అని ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్‌లో ఉంటారు. ప్రతిరోజూ కాలేజీకి వెళ్లి, రావడానికి స్టైలిష్‌గా ఉండే బైక్ కోసం మీరు సెర్చ్ చేస్తుంటారు. ఇలాంటి యూత్ కోసం ప్రీమియం స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ KTM ఇండియా తన నేకెడ్ మోటార్‌సైకిల్ లైనప్‌లో ఒక చిన్న అప్‌డేట్‌ను అందించింది.

    2.14Lakhs|
    2.14Lakhs|

    కంపెనీ తన “2026 KTM 250 డ్యూక్”, “2026 KTM 200 డ్యూక్‌” మోడళ్లలో కొత్త కలర్​లను తీసుకొచ్చింది. సిల్వర్ మెటాలిక్, స్లేట్ గ్రే. సిల్వర్ మెటాలిక్ ఆప్షన్‌లో సిల్వర్-ఫినిష్డ్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లతో ముదురు బూడిద రంగు ఫ్యూయెల్ ట్యాంక్ లభిస్తుంది. మరోవైపు దీని స్లేట్ గ్రే వెర్షన్ నారింజ రంగు ఫినిషింగ్​తో ఫ్యూయెల్​ ట్యాంక్‌ను అందిస్తుంది. ఇది ముదురు బూడిద రంగు ట్యాంక్ ప్యానెల్‌లతో వస్తుంది. ఇవి ఈ మోటార్​సైకిల్​కు స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. అయితే వీటి ధరలను వెల్లడించలేదు. కానీ రెండు కొత్త రంగు ఎంపికలతో దీని ధర రూ. 2.14 లక్షలు ఉంటుందని అంచనా.

    Leave a Reply